Solar storm: చండ చండం..తీవ్ర తీవ్రం..ముంచుకొస్తోంది

Solar Storm: తస్మాత్ జాగ్రత్త.. కొత్త రకం తుపాను ముంచుకొస్తోంది. భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది. భూమిని తాకితే మాత్రం పెను నష్టాలే జరగనున్నాయి. ఇంతకీ అదేంటో తెలుసా..

Last Updated : Dec 10, 2020, 06:58 PM IST
  • భూమిని తాకనున్న సోలార్ తుపాను
  • జీపీఎస్ పొజిషనింగ్ లోపాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ నష్టం కలిగే అవకాశాలు
  • కెనడా, నార్త్ యునైటెడ్ స్టేట్స్ పై తీవ్ర ప్రభావం
Solar storm: చండ చండం..తీవ్ర తీవ్రం..ముంచుకొస్తోంది

Solar Storm: తస్మాత్ జాగ్రత్త.. కొత్త రకం తుపాను ముంచుకొస్తోంది. భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది. భూమిని తాకితే మాత్రం పెను నష్టాలే జరగనున్నాయి. ఇంతకీ అదేంటో తెలుసా..

సముద్రంలో తుపాన్లు ( Cyclones ) చూశాం..ఇసుక తుపాన్లు చవి చూశాం. ఈదురు గాలుల బీభత్సం గురించీ విన్నాం. మరి ఈ తుపాను..కొత్త రకం తుపాను. పెను భీభత్సాన్ని సృష్టించనుంది. అదే సౌర తుపాను ( Solar storm ). ఇప్పుడు భూమి ( Earth ) వైపు దూసుకొస్తోంది. కెనడా, ఉత్తర యునైటెడ్ స్టేట్స్ ప్రాంతాల్లో దీని ప్రభావం కన్పించనుంది. ఈ సౌర తుపాను వల్ల జీపీఎస్ పొజిషనింగ్ ( GPS Positioning ) లోపాలు తలెత్తి..కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చని శాస్త్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..ఈ వారం ప్రారంభంలో సూర్యుడి నుంచి ఒక సౌర మంట అంటే సోలార్ ఫ్లేమ్ ( Solar flame ) పేలింది. ఈ పేలుడు వల్ల సౌర తుపాను నెమ్మెదిగా భూమి వైపుకు విస్తరిస్తోంది. దీంతో కెనడా, ఉత్తర యునైటెడ్ స్టేట్స్ అంతటా భూ అయస్కాంత తుపాను, నార్తర్న్ లైట్స్ ప్రభావం చూపించనుంది. డిసెంబర్ 7వ తేదీన ఏఆర్‌ 2790 గా పిలుస్తున్న సన్ స్పాట్ ( Sun spot ) నుంచి సోలార్ ఫ్లేమ్ ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సాధారణంగా కన్పించిందని..క్రమంగా ఇది బలపడిందని అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఇది క్రమేణా విస్తరించి..చికాగో, డెట్రాయిట్, బోస్టన్, సియాటెల్ వరకూ నార్తర్న్ లైట్స్ ప్రభావం కన్పిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. Also read: Donald Trump: వ్యాక్సిన్ ఫస్ట్ మాకు ఇవ్వాల్సిందే!

Trending News