Sri Lanka Petrol: మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్‌ పెట్రోల్‌ రూ.420, డీజిల్‌ రూ.400!

Sri Lanka hikes fuel prices. Petrol Rs 420 per Litre at Sri Lanka. మంగళవారం పెరిగిన ధరలతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.420కి, డీజిల్ ధర రూ.400కి చేరింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:05 PM IST
  • మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు
  • లీటర్‌ పెట్రోల్‌ రూ.420
  • ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం
Sri Lanka Petrol: మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్‌ పెట్రోల్‌ రూ.420, డీజిల్‌ రూ.400!

Petrol Rs 420 per Litre and Diesel Rs 400 a Litre in Sri Lanka: పొరుగు దేశమైన శ్రీలంకలో ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. దాంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే లంకను ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇది చాలదన్నట్టు మంగళవారం చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. లీటర్ పెట్రోల్‌ ధర 24.3 శాతం పెరగ్గా.. డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది. 

మంగళవారం పెరిగిన ధరలతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.420కి, డీజిల్ ధర రూ.400కి చేరింది. ఈ ధరలు లంక గరిష్ట స్థాయిలను తాకాయి. పెట్రోల్‌పై 24.3 శాతం అంటే రూ.88ను, డీజిల్‌పై 38.4 శాతం అంటే రూ.111 ధరను పెంచాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ రంగానికి చెందిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. 2022 ఏప్రిల్ 19 నుంచి ఇంధన ధరలను పెంచడం అక్కడ ఇది రెండోసారి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. 

శ్రీలంక దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో.. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. పెద్దపెద్ద క్యాన్స్, డ్రమ్ములు పట్టుకుని నిల్చున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఉత్తర మధ్య ప్రావిన్స్ లోని బంకు యజమాని ఇళ్లును తగలబెట్టారు. ఈ సమయంలో మనగలవారం పెట్రోల్ ధరలు పెరగడంతో జనాలు రోడ్డుపైకి ఎక్కి నిరసలు చేస్తున్నారు. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్య ప్రజల నుంచి ఆటో డ్రైవర్లు భారీగా వసూలు చేస్తున్నారట. మొదటి కిలోమీటరుకు ప్రయాణికుడి వద్ద రూ.90 తీసుకుంటామని, రెండో కిలోమీటరు నుంచి రూ.80 తీసుకుంటామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇంధన కొరతను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. 

Also Read: MLC Ananthababu: హంతకుడిని గారూ అని సంబోధిస్తారా! కాకినాడ ఎస్పీపై జనాల ఫైర్..

Also Read: Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News