Modi - Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో .. ప్రధాని నరేంద్ర మోడీ భేటి..

Modi - Trump: అమెరికా అధ్యక్షుడిగా  డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికైన తర్వాత ..  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనతో తొలిసారి  భేటీ కావడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు ప్రపంచ నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పన్నులు , వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్‌ వివరించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 14, 2025, 10:26 AM IST
Modi - Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో .. ప్రధాని నరేంద్ర మోడీ భేటి..

Modi - Trump: డొనాల్డ్ ట్రంప్ గతేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో మరోసారి గెలిచి శ్వేత భవనంలో అడుగుపెట్టారు. ఈయన అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించారు. ముందుగా ఫ్రాన్స్ లో పర్యటించిన మోడీ.. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ముఖ్యంగా  ఓవల్‌ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైట్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీని డొనాల్డ్  ట్రంప్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ డొనాల్డ్‌ ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

రెండోసారి వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్‌ కు 140కోట్ల మంది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేసారు మోడీ. ట్రంప్ అనే పేరు, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని నమో వివరించారు. అలాగే 140కోట్ల మంది భారతీయులకు కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందన్నారు.  ట్రంప్‌ హయాంలో ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించారు.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్‌ పాత్రపై మాట్లాడిన ట్రంప్‌- తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని తెలిపారు. సమీప భవిష్యత్తులో భారత్‌-అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించనున్నట్టు చెప్పారు. భారత్‌-అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News