India Canada News: ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తలకు కేంద్రం కీలక ప్రకటన..ఏం జరిగిందంటే?

ఖలీస్థానీ ఉగ్రవాది హతమార్చడంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా భారతదేశంలోని దౌత్య కార్యలయాల్లో కెనడా ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని వలన ఇరు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావం పడనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 03:16 PM IST
India Canada News: ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తలకు కేంద్రం కీలక ప్రకటన..ఏం జరిగిందంటే?

India Canada News: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఖలీస్థానీ ఉగ్రవాది హతమార్చడంపై ఇరు దేశాల మధ్య ఈ వాగ్వాదం చెలరేగింది. ఈ కారణంగా భారతదేశంలోని దౌత్య కార్యలయాల్లో కెనడా ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కెనడా పౌరులకు వీసా సేవలను నిలిపేస్తున్న కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ప్రకటన వల్ల ఇరు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. 

భారత్‌లో కెనడా దౌత్యపరమైన జోక్యం ఎక్కువగా ఉందని.. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. "దౌత్యపరమైన విషయాల్లో సమానత్వాన్ని పాటించాలని కెనడా ప్రభుత్వానికి తెలియజేశాం. దౌత్య కార్యాలయాల్లో కెనడా అధికారులతో పోలిస్తే మా అధికారులు తక్కువ మంది ఉన్నారు. భద్రత పరమైన హెచ్చరికలు వస్తున్న క్రమంలో అధికారులను తగిన భద్రత కల్పించడం సహా వారి సంఖ్య తగ్గించమని సూచించాం. మా అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యపరమైన జోక్యం మరో అంశం" అని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. 

కెనడాలో వీసా దరఖాస్తులను సస్పెండ్ చేయడంతో విదేశాంగ అధికారులకు భద్రతా బెదిరింపులకు లోనయ్యారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది వీసా విధులను నిర్వహించలేక పోతున్నారని ఆయన అన్నారు. "ప్రస్తుతం, కెనడాలో సెక్యూరిటీ పరిస్థితులతో పాటు కెనడియన్ ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోని కారణంగా మేము వీసా సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం" అని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. 

Also Read: Protein Poisoning: మితిమీరిన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే..మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్టు!

మరోకరి హత్య!!
కెనడాలో జరిగిన జరిగిన ఓ గ్యాంగ్ వార్ లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ గ్యాంగ్ స్టర్ మృతి చెందాడు. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా అనే గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో హతమైనట్లు కెనడాలోని విన్నిపెగ్ పోలీసులు ధృవీకరించారు. అతను మరణించిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశామని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు. విన్నిపెగ్ పోలీసుల ప్రకారం.. సెప్టెంబరు 20 తేదీన ఉదయం 10 గంటల (భారత కాలమానం ప్రకారం) సమయంలో నార్త్ ఇంక్ స్టర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రకటించారు. 

అయితే ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేసింది. విన్నిపెగ్ నగరంలో సుఖ్దూల్ సింగ్ నివసించే ఫ్లాట్ కు వెళ్లి చంపినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సుఖ్దూల్ సింగ్ తలలో 8 బుల్లెట్లను కాల్చినట్లు స్పష్టం చేసింది.

Also Read: శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? ఈ డ్రింక్స్ తాగండి.. కొన్ని రోజుల్లోనే ఫలితం పొందుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News