US- Bharat Illegal Migrants: అమెరికా నుంచి 116 మంది భారతీయులతో కూడిన రెండో విమానం భారత్ కు చేరింది. అమెరికాకు చెందిన సీ-17 సైనిక విమానం పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో లాండ్ అయింది. అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిలో పంజాబ్‌కు చెందినవారు 65 మంది ఉన్నారు. అటు హరియాణా నుంచి 33మంది, గుజరాత్‌కు చెందిన వారు 8మంది చొప్పున ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వీరిలో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల అమ్మాయి సహా ఇద్దరు మైనర్లు ఉన్నారని సమాచారం. ఈ విమానంలో వచ్చిన వాళ్లలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల వయసున్నవారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరే కాకుండా 157మందితో మూడో విమానం ఆదివారం భారత్‌కు చేరుకునే అవకాశం ఉందట. ఇప్పటికే 104మందితో తొలి బృందం ఈనెల 5న స్వదేశం చేరుకుంది.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
అక్రమ వలసదారుల విమానాలను ఢిల్లీలో కాకుండా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ చెయ్యడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ను, అక్కడి ప్రజలను అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం ఈ పని చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమవలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు, ఎలా వెళ్లాల్సి వచ్చిందో, ప్రజలు తెలుసుకోవాలంటోంది. యువత వద్ద నుంచి డబ్బులు తీసుకుని అక్రమమార్గాల్లో వారిని అమెరికాకు పంపిన నిందితులను పట్టుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.