Indian Illegal Migrants: సీ-17 గ్లోబ్ మాస్టర్ 3 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. ఈ విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగిలినవారు హరియాణాకు చెందిన వారు 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, గోవా,రాజస్థాన్ నుంచి చెరో ఇద్దరు ఉన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఇద్దరు, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు తిరిగి పంపేవరకు ప్రతివారం బహిష్కరణ ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధికారులు తెలిపారు.
ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ అంశంపై మాట్లాడారు. అనంతరం చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదన్నారు ప్రధాన మోడీ. ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
యువత, పేదరికంలో ఉన్నవారికి డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి అక్రమరవాణా కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదిలా ఉంటే ఇకపై కూడా అక్రమవలసదారులను వారి స్వదేశానికి పంపించే ప్రకియ కంటిన్యూ ప్రాసెస్ అన్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ... ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. ఒక గ్రీటింగ్ కార్డులో ‘గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి. వైలెట్‌లు నీలి రంగులో ఉంటాయి. చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తే బహిష్కరిస్తామన్నారు. ఈ గ్రీటింగ్ కార్డులో సీరియస్‌గా ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు సరిహద్దు చీఫ్ థామస్ హోమన్‌ల ఫొటోలు ఉన్నాయి.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం.. 18వేల మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20వేల మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు.. 17వేల940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2వేల 467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇవి 2022 నాటి లెక్కలని, ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
అమెరికాలో మొత్తంలో 7లక్షల 25వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా, సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.