Yadadri Temple: తెలంగాణలో కొలువైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు వేద పండితులు శ్రీకారం చుట్టారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం 7.45కు పంచకుండాత్మక మహాయాగాన్ని మొదలు పెట్టారు. ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల కొనసాగనున్నాయి.
శాస్త్రోక్తంగా యాగం నిర్వహణకు అవసరమైన సంప్రదాయ వనరులను సమకూర్చినట్లు ఆలయ పూజారులు తెలిపారు. కొండ, ఆలయం, యాగశాల శుద్ధి కైంకర్యాలు చేపట్టి స్వస్తి వాచనం నిర్వహించారు. వానమామలై మఠం పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం కొనసాగనుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఐదు రోజులపాటు కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని అన్న సత్రం భవనంలో నిత్యం రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తారు. ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయలాన్ని పున్: నిర్మించారు. మొత్తంగా కృష్ణ శిలతో నిర్మించారు. మొత్తంగా తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రభుత్వం అధికారికంగా కట్టించిన ఆలయం భారత దేశంలో యాదగిరి గుట్ట అని చెప్పాలి. ఏది ఏమైనా కేసీఆర్ యాదగిరి గుట్ట పేరును చిన్న జీయర్ స్వామి సూచనతో యాదాద్రిగా మార్చిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.