Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకుని వారి ఓట్లను రాబట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా పాట్లు పడుతున్నాయి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో మద్యం ఏరులైపారుతోంది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారికే కాకుండా చాలా వరకు ఇంట్లో కూర్చునే వారికి కూడా చుక్క, ముక్క లేనిదే బుక్క దిగే పరిస్థితి లేదని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కొన్ని గ్రామాల్లో, కొంత మంది నేతలు ఇంటింటికీ ఏకంగా చికెన్, మద్యం పంపిణి చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇవన్నీ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో స్థానికంగా నివాసం ఉండే వారికి మాత్రమే దక్కే ఉప ఎన్నికల తాయిలాలు. మరి ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఊరు విడిచి పట్నం బాట పట్టిన వారికి ఆ మర్యాదలు ఎలా దక్కాలనుకున్నట్టున్నారు కాబోలు.. ఇదిగో ఇలా మునుగోడు నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కి వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వారి కోసం ఆదివారం హైదరాబాద్ లోనే ఓ దావత్ ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే ఓటర్ల పేరు రాసుకుని మరీ మందు బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చి, ఇక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్న మందు బాబులకు తుర్క యాంజాల్ మునిసిపాలిటీ మన్నేగుడాలోని జివీఆర్ కన్వెన్షన్ హల్లో మందు బాటిళ్ల పంపిణీ చేశారు. నగరంలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న మునుగొడు నియోజకవర్గంలోని మర్రిగుడ మండలం వట్టిపల్లీ, కొండూరు, మర్రిగుడా గ్రామాలకు చెందిన ఓటర్లతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలో వివరించి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంత్రి హరీశ్ రావు సమావేశం ముగించుకుని వెళ్లిపోయిన అనంతరమే అసలు కార్యక్రమానికి తెరతీశారు. ఈ మీటింగ్‌కి వచ్చిన నగరంలోని ఓటర్లకు ఒక్కో బ్లెండర్ స్ప్రెడ్ ఫుల్ బాటిళ్లను పేర్లు రాసుకొని పంపిణీ చేశారు. ఈ మద్యం బాటిళ్ల పంపిణి కార్యక్రమంలో రేషన్ పాటిస్తూ ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నేతలు, ఇంచార్జులు పర్యవేక్షించారు. దీంతో కొందరు ఓటర్లు ఒక్కో బాటిల్, ఓట్లు ఇంకాస్త ఎక్కువగా ఉన్నవారు ఫుల్ బాటిల్ కార్టన్లు కూడా ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన్నెగూడలోని గుత్తా వసంత్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్ ఈ ఘటనకు వేదికైంది. విచిత్రం ఏంటంటే.. ఇదంతా జరుగుతోంటే పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్పించి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ధమాకా ఆఫర్లు.. స్వీట్లు, టపాసులు, చీరలతో పాటు..!
Also Read : Budida Bikshamaiah Goud: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బిక్షమయ్య గౌడ్‌కి మరీ అంత కోపం ఎందుకంటే..
Also Read : Munugode Bypoll: ఓట్ల కోసం కోటి తిప్పలు.. యాదాద్రిలో మునుగోడు ఓటర్లకు స్పెషల్ దర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి