TSPSC Jobs Notification 2023: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

TSPSC released Job notification for Junior Lecturers. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 9, 2022, 07:27 PM IST
  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
  • లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • కొన్ని నెలలుగా వరుసగా నోటిఫికేషన్స్
TSPSC Jobs Notification 2023: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

TSPSC released notification for Junior Lecturer Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆరంభం అవుతుందని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 

2022 డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 6 వరకు జూనియర్ లెక్చరర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. 2023 జూన్ లేదా జులైలో రాతపరీక్షలు ఉండొచ్చని చెప్పింది. 1392 పోస్టులలో అత్యధికంగా గణితంలో 154 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లిష్ 153, హిందీ 117, జువాలజీ 128, ఫిజిక్స్ 112, కెమిస్ట్రీ 113 జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇతర విభాగాల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

టీఎస్‌పీఎస్‌సీ నుంచి ఇప్పటికే మరో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని 18 డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 15 వరకు  స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. 1147 పోస్టుల్లో అత్యధికంగా అన‌స్థీషియాలో 155 పోస్టులు ఉన్నాయి. ఇక జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

Also Read: Janhvi Kapoor Bikini Pics: జాన్వీ కపూర్ బికినీ ట్రీట్.. సముద్రంలో సెగలు! అది మాత్రం కవర్ చేసేసిందిగా  

Also Read: Telangana News: అచ్చు సినిమాలో మాదిరే.. 100 మందితో వచ్చి యువతిని ఎత్తుకెళ్లిన యువకుడు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News