Meerpet Cooker Muder Case: మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. వీటిని డిఎన్ఏ టెస్ట్‌కు పంపించారు. ఇవి మాధవి పిల్లల డీఎన్ఏతో సరిపోలితే మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మారుస్తారు. ఈనెల 15వ తేదీ భార్య కనిపించడం లేదు అంటూ అత్తామామలతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో గురుమూర్తి మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. అయితే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత గురుమూర్తి పై అనుమానం కలిగింది. దీంతో తమదైన స్టైల్లో పోలీసులు గురుమూర్తిని విచారించగా భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
గురుమూర్తి తన భార్య మాధవి (35) హ్యత చేసిన విధానం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతుంది. ముఖ్యంగా మాధవిని గురుమూర్తి ఎప్పటినుంచో చంపాలని చూస్తున్నాడు. గురుమూర్తికి తన బంధువుల్లోని వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన మాధవి నిలదీయగా గొడవ జరిగింది. గురుమూర్తి ఫోన్లో కూడా సదరు మహిళ ఫోటోలు ఉన్నాయి.
అయితే అప్పటికే సంక్రాంతి పండుగ సమయంలో పిల్లలను చెల్లి వద్ద వదిలి వచ్చిన గురుమూర్తి, వివాహేతర సంబంధం గురించి మాధవి నిలదీయగా గొడవ జరిగింది. దీంతో ఆమెను గోడకేసి కొట్టగా చనిపోయింది. మాధవిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బాత్రూంలోని హీటర్‌లో వేసి కాల్చాడు గురుమూర్తి. ఆ తర్వాత బొక్కలను ముక్కలు వేరుచేసి రోకలితో ముక్కలను దంచి ముద్దగా చేశాడు. ఇక బొక్కలను కూడా కాల్చేస్తాడు వీటిని ఒక సంచిలో వేసుకొని చెరువులో పారేశాడు.
అయితే నిన్నటి వరకు పోలీసులకు చెరువులో గాలించినా మాధవికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇక గురుమూర్తి కూడా చంపింది నేనే కానీ ఆధారాలు లేవు కదా కోర్టులో తేల్చుకుందాం అని పోలీసులతో అన్నాడు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు. ప్రస్తుతం డీఆర్డీఓలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే, ఆధారాలు లేక తలలు పట్టుకున్న పోలీసులకు కీలక ఆధారాలు నేడు లభించాయి. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో ఇంట్లో రక్తపు మరకలను గుర్తించారు. ఇది కాకుండా స్టవ్ వద్ద మాధవి వెంట్రుకలు కాలిన స్థితిలో కనిపించాయి. వీటిని కలెక్ట్ చేసుకుని డిఎన్ఏకి పంపించారు. ఇక పిల్లలతో డీఎన్ఏతో ఇవి మ్యాచ్ కాగానే ఆ మిస్సింగ్ కేస్ కాస్త మర్డర్ కేసుగా మారుస్తారు.
ఇదీ చదవండి: పవర్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ.. ఐశ్వర్య హోలక్కల్ ఫోటోస్ వైరల్..
అయితే, ఆధారాలు అన్ని మాయం చేసిన గురుమూర్తి ఇంటికి వచ్చిన పిల్లలు దుర్గంధం వస్తుందని తండ్రిని అడగ్గా మౌనంగా ఉన్నాడట. మరోవైపు ఈ మర్డర్ కేసు విషయం తెలిసిన తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ ప్రాంతవాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మహిళ సంఘాలు కూడా గురుమూర్తిని విడిచిపెట్టే సమస్యే లేదు. మాధవిని అత్యంత కిరాతకంగా మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది? విడాకులు ఇస్తే సరిపోతుంది. ఇద్దరు పిల్లలకు తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు? అంత కిరాతకంగా మర్డర్ ఎలా చేస్తాడు? అని మండిపడుతున్నారు. గురుమూర్తిని కచ్చితంగా ఉరిశిక్ష విధించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. డిఎన్ఏ లో ఆ వెంట్రుకలు మాధవి అని తెలిస్తే మాత్రం కచ్చితంగా మిస్సింగ్ కేస్ కాస్త మర్డర్ కేసుగా మార్చడానికి రెడీ అవుతున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: జనవరి 31లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే 19వ విడత కిసాన్ డబ్బులు పొందలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter