Donald Trump: అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ట్రంప్ కు ఎదురు దెబ్బ..!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 24, 2025, 07:35 AM IST
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ట్రంప్ కు ఎదురు దెబ్బ..!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ అమెరికా ప్రజల మన్ననలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నాడు.  జన్మతః పౌరసత్వ హక్కును ఒక్క ఉత్తర్వుతో ట్రంప్ రద్దు చేయడాన్ని అమెరికాలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్‌ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి.

22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీ నగరాలు .… మసాచుసెట్స్‌లోని ఫెడరల్‌ డిస్టిక్ట్ర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని కోర్టులో తమ వాదనలు వినిపించాయి.  

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని దిగువ సభ లేదంటే సెనేట్‌ ఎగువ సభకు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్‌ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్ లోని ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు లా.. అక్కడ పుట్టుకతో వచ్చే సిటిజన్ షిప్ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఓరేగాన్, ఇల్లినాయస్, అరిజోనా రాష్ట్రాల వాదనల ఆధారంగా యూఎస్ డిస్ట్రిక్ జడ్జ్ జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. పేరేంట్స్ వలసలతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టే వారందరికీ లభించే సిటిజన్ షిప్ లభించే విధానం ట్రంప్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉండేది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాకా కార్యనిర్వహక ఉత్తర్వుల ద్వరా జన్మత: పౌరసత్వ హక్కను రద్దు చేశారు. దీనిపై డెమొక్రాట్స్ పాలిస్తున్న 22 రాష్టరాలు, 5 దావాలు వేసాయి. ఈ ఆదేశాలు 14 రోజులు పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News