Meerpet Cooker Murder Case: నిన్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసు మరో మలుపు తిరిగింది. అసలు విషయానికి వస్తే డీఆర్డీఓ అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేసే గురుమూర్తి భార్య మాధవి (35)పై అనుమానంతో అత్యంత కిరాతకంగా చంపాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ అత్తామామతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈనెల 13వ తేదీ భార్య మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. అతనిపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే నిజం ఒప్పుకున్నాడు.
ప్రాక్టీస్ కోసం కుక్కను చంపిన ఘనుడు..
ఈ కిరాతకుడు భార్యను చంపడానికి ముందే ప్రాక్టీస్ కోసం కుక్కను చంపాడట. విషయం తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. మాధవిని చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మాంసం, బొక్కలను వేరు చేశాడు. బొక్కలను కాల్చి పొడి చేశాడు, ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించాడు. వాటిని డ్రైనేజీ, చెరువులో పడేశాడు. గురుమూర్తి ఇద్దరు పిల్లలు సంక్రాంతి సందర్భంగా బంధువు ఇంటికి వెళ్లారు. వారిని తీసుకు వచ్చే విషయంలో గురుమూర్తి, మాధవిల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే క్షణికావేశంలో మర్డర్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం సెక్యూరిటీగా పనిచేసిన గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు.
బిల్డింగ్ ఖాళీ..
అయితే, గురుమూర్తికి భార్య మాధవిపై అనుమానం కూడా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గొడవ జరిగినపుడు ఆమెను కిరాతకంగా మటన్ కట్ చేసే కత్తితో మర్డర్ చేశాడు. ఈ మర్డర్ కేసు విషయం తెలుసుకున్న కాలనీలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇక ఈ బిల్డింగ్‌లో ఉన్న వాళ్లు సైతం భయంతో తాళాలు వేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌కు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు 25వ తేదీ సెలవు.. ఎందుకో ముందుగానే తెలుసుకోండి..
పొంతనలేని సమాధానాలు..
మరోవైపు పోలీసులు గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తి చెప్పి నిజాలకు ఒక్కదానికి కూడా ఆధారాలు లేకపోవడంతో కేసు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా గురుమూర్తి చెప్పిన కుక్కర్, కత్తులు, హీటర్, బకెట్ మాధవి మర్డర్‌కు ఉపయోగించిన అన్ని వస్తువులు ఫోరెన్సిక్ టీమ్‌తో తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. దీంతో వారు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే చెరువులో కూడా గాలించిన పోలీసులు అక్కడ కూడా ఏ ఆధారాలు లభించలేదు.
ఇదీ చదవండి: నిమ్మకాయ ఇలా వాడారంటే ఎలాంటి డాండ్రఫ్ అయినా మీ నెత్తి నుంచి వదిలి పోవాల్సిందే..
గతంలో మీరా రోడ్ మర్డర్..
2023లో ముంబైలోని మీరా రోడ్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 9 ఏళ్లుగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే, వారి మధ్య గొడవల నేపథ్యంలో మనోజ్ సేన్ అనే వ్యక్తి 32 ఏళ్ల సదరు మహిళను ఇలాగే చంపి ఎలక్ట్రిక్ సా మెషీన్‌తో బాడీని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఎన్ని ముక్కలు చేశాడు పోలీసులు కూడా లెక్కపెట్టలేక ఖంగుతిన్నారు. ఆ బాడీ ముక్కలను కొన్నింటిని కుక్కర్లో వేసి ఉడికించి మరికొన్నింటిని నూనెలో వేసి వేయించాడు. కొన్ని ముక్కలను మిక్సీలో వేశాడు ఇంకొన్ని వీధికుక్కలకు కూడా వేశాడు ఆ కిరాతకుడు. పోలీసులకు ఈ మర్డర్ గురించి హంతకుడు రకరకాల కథలు చెప్పుకొచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.