White Hair Turns Black in 5 minutes: నువ్వుల నూనెతో మనం వంటల్లో మాత్రమే కాదు ఆహారాల్లో కూడా వినియోగిస్తాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, బ్యూటీ రొటీన్లో నువ్వల నూనెను చేర్చుకుంటే కూడా ప్రయోజనాలు మెండు. ముఖ్యంగా తెల్లవెంట్రుకలను ఇవి కేవలం ఐదు నిమిషాల్లో నల్లగా మార్చేస్తాయి.
నువ్వుల నూనె జుట్టుకు ఉపయోగించడం వల్ల కుదుళ్ల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు చుండ్రుకు కూడా చెక్ పెడుతుంది. నువ్వుల నూనెతో నిర్జీవంగా ఉన్న జుట్టుకు జీవం వస్తుంది. అంతేకాదు తరచూ నువ్వుల నూనె జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
నువ్వుల నూనెలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మాయిశ్చర్ అందుతుంది. పొడిబారకుండా ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య మీ దరిచేరకుండా ఉంటుంది.
నువ్వుల నూనెను హెన్నాలో వేసి కలపాలి. తెల్ల వెంట్రుకల సమస్య ఉన్నవారు ఇది జుట్టు అంతటికీ పట్టించాలి. కాఫీ పొడితో కలిపి హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు ఒక్కటి కూడా కనిపించదు. ఇది వైట్ హెయిర్ సమస్యతో బాధపడేవారికి నేచురల్ రెమిడీ.
అంతేకాదు నువ్వుల నూనెను నేరుగా జుట్టుకు అప్లై చేయండి. కాసేపు అయిన తర్వాత తలస్నానం చేయాలి. సాధారణ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. కుదుళ్ల నుంచి జుట్టు బలంగా కూడా మారుతుంది.
నువ్వుల నూనెను మీ బ్యూటీ రొటీన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని శనగపిండి, కాస్త పసుపు, నువ్వుల నూనె కలిపి ముఖానికి స్క్రబ్ మాదిరి రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి. ముఖంపై గ్లో వస్తుంది.