Jalgaon Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మందికి పైగా దుర్మరణం.. వీడియో వైరల్..

Maharashtra train accident:  మహారాష్ట్రలోని జలగావ్‌‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తొంది. ఈ ప్రమాదంకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 22, 2025, 07:03 PM IST
  • జల్ గాన్‌లో ఘోర రైలు ప్రమాదం..
  • పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో షాకింగ్ ఘటన..
Jalgaon Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మందికి పైగా దుర్మరణం.. వీడియో వైరల్..

 Maharashtra jalgaon train accident video: ఇటీవల తరచుగా రైలు ప్రమాదాలు వార్తలలో ఉంటున్నాయి. కొన్నిసార్లు ఒకే ప్లాట్ ఫామ్ మీద మరో ట్రైన్ రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని సార్లు ట్రైన్ లు సిగ్నల్ లోపం వల్ల లేదా టెక్నికల్ సమస్యల వల్ల రైళ్లు ప్రమాదాలకు గురౌతున్నాయి. మరికొన్నిసార్లు ట్రైన్ లలో షార్ట్ సర్వ్యూట్ ల వల్ల కూడా ప్రమాదాలు అనేక సందర్భాలలో జరిగాయి.

తాాజాగా.. మహారాష్ట్రలోని జలగావ్‌‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తొంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు లక్నో నుంచి ముంబై కి ప్రయాణిస్తుంది. బుధవారం సాయంత్రం 4.25 గంటలకు పరందా రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే ట్రైన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ మీదకు దూకేశారు.

 

ట్రైన్ లో చైన్ నులాగారు.  పలువురు ప్రయాణికులు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశారు. అదే సమయంలో ప్లాట్ ఫామ్ మీద మరో ట్రైన్ కింద ప్రయాణికులు పడ్డారు.  బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్.. వారిపై నుంచి దూసుకెళ్లింది.

Read more: Actress Gautami: మీ వల్లే మహిళలపై అత్యాచారాలు.. బాంబు పేల్చిన నటి గౌతమి.. అసలేం జరిగిందంటే..?

అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ రైల్వేస్ విచారణకు ఆదేశించింది. పెద్ద ఎత్తున అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు.   చక్రాల  నుంచి పొగలు చూసి కొంత మంది వదంతులు వ్యాప్తి చేశారు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News