TG Inter Hall Tickets 2025: తెలంగాణలో మార్చ్ 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల అడ్రస్ గుర్తించడంలో, చేరుకోవడంలో ప్రతిసారీ విద్యార్ధులకు ఇబ్బందే. ఈసారి ఆ పరిస్థితికి చెక్ పెడుతోంది ప్రభుత్వం. హాల్ టికెట్లపైనే లొకేషన్ కోడ్ ప్రింట్ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చ్ 5 నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ అయ్యాయి. ఈసారి హాల్ టికెట్లలో కొత్తగా ఒక క్యూ ఆర్ కోడ్ కన్పిస్తుంది. ఇంటర్ పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అడ్రస్ తెలియకపోవడంతో ఒక్కోసారి పరీక్ష కేంద్రానికి ఆలస్యమౌతుంటారు. అంతేకాదు..హాల్ టికెట్‌పై అడ్రస్ ఎప్పుడూ సంక్షిప్తంగా ఉంటుంది. ఈ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈసారి ఇంటర్ హాల్ టికెట్లపై అడ్రస్ పూర్తిగా డోర్ నెంబర్, వీధి పేరు, కాలనీ పూర్తిగా ప్రింట్ చేశారు.
మరోవైపు హాల్ టికెట్లపై ఈసారి కొత్తగా లొకేషన్ క్యూ ఆర్ కోడ్ ప్రింట్ చేశారు. ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ ఆధారంగా సులభంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. అక్కడికీ ఇబ్బంది తలెత్తితే హాల్ టికెట్‌పై ఐవీఆర్ నెంబర్ ముద్రిస్తున్నారు. అడ్రస్ విషయంలో ఇబ్బంది ఎదురైతే ఈ నెంబర్‌కు పోన్ చేసి తెలుసుకోవచ్చు.
హాల్ టికెట్ లింక్‌ను విద్యార్థి, తల్లిదండ్రుల మొబైల్‌కు నేరుగా పంపిస్తున్నారు. సదరు విద్యార్థి ఈ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి