నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీ

Last Updated : Jul 13, 2019, 11:53 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీ

హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త వెల్లడించింది. ఇటీవలే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ ప్రారంభించిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో బోధకులు, ప్రిన్సిపల్, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు ఉండగా ఈ విద్యా సంవత్సరమే నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా ప్రారంభించిన 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సిబ్బంది కోసం తాజాగా నియామకాలు చేపట్టనున్నట్టు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1071 టీజీటీ, 119 పీఈటీ, 36 ప్రిన్సిపల్ సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణా రావు శుక్రవారమే ఉత్తర్వులు జారీచేశారు. 

కేటగిరిల వారీగా భర్తీ కానున్న పోస్టుల వివరాలు:
కేటగిరి      - ఖాళీల సంఖ్య
ప్రిన్సిపల్ - 36
ట్రెయిన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ (టీజీటి) -1071
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటి) -119
లైబ్రేరియన్ - 119
క్రాఫ్ట్స్/ఆర్ట్స్/మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ - 119
స్టాఫ్ నర్స్ - 119
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ -110
జూనియర్ అసిస్టెంట్ - 05
మొత్తం పోస్టులు - 1,698
 
టీఆర్‌ఈఐ-ఆర్బీ ద్వారా పోస్టుల భర్తీ:
అయితే, ఈ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐ-ఆర్బీ) ద్వారా ఈ మొత్తం పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్థానికత, ఆయా ప్రాంతాల్లో పోస్టుల ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లను ప్రాతిపదికగా తీసుకుని నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 

Trending News