BSNL 300 Days Plan: ప్రభుత్వరంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తుంది. కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఏడాదిలోనే 50 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను పొందగలిగింది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ అందుకే ఈ ప్లాన్స్ ఎంచుకుంటున్నారు.
బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ కంపెనీ. మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే 300 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ బెస్ట్. మీరు తరచూ రీఛార్జీ చేసుకునే అవసరం లేదు. ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది.
అయితే ఇది సెకండ్ సిమ్ ఉన్నవారికి సిమ్ యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.దీని ధర కేవలం రూ.797 మాత్రమే. మీ సిమ్ కార్డ్ ఒక్కసారి ఈ ధరతో రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వస్తుంది.
బీఎస్ఎన్ఎల్ 300 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో 60 రోజుల పాటు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. ప్రతిరోజూ 2 జీబీ డేటా హైస్పీడ్ డేటా అంటే 60 రోజులపాటు 120 జీబీ డేటా వస్తుంది.
100 ఎస్ఎంఎస్లు కూడా 60 రోజులపాటు పొందుతారు. ప్రతిరోజూ డేటా అవసరం లేకుండా, ఇన్కమింగ్ కాల్స్‌కు, సెకండ్ సిమ్ యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీ సిమ్ కార్డ్ యాక్టీవ్‌గా ఉంటుంది.
అయితే, ఈ ప్లాన్ డీల్ ఫిబ్రవరి 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ డీల్ మిస్ అయితే, మరో కొత్త డీల్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. బడ్జెట్ ఫ్రెండ్లీలో లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కావాలంటే ఈ 300 రోజుల ప్లాన్ బెస్ట్.