YS Jagan Residence: ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు జరగ్గా.. ఈ వేడుకలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. బర్త్ డే వేడుకల పేరుతో పలుచోట్ల హల్చల్ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అరుపులు.. కేకలతో జగన్ నివాసం వద్ద బలప్రదర్శన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడంతో వారు వెనక్కి తగ్గారు. కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: BJP Master Plan: చంద్రబాబుకు దీటుగా బీజేపీ మాస్టర్ ప్లాన్.. 22 జిల్లాల అధ్యక్షుల ఎంపిక
విజయవాడ, గుంటూరులో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు. జెండాలు.. ఫ్లెక్సీలతో ర్యాలీ తీస్తున్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి వైపునకు దూసుకొచ్చారు. జగన్ ఇంటి ముందుకు రాగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు.
Also Read: Glass Symbol: పవన్ కల్యాణ్‌కు భారీ శుభవార్త.. జనసేనకు శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్
ఇంటి బయట పెద్ద ఎత్తున హారన్లు మోగిస్తూ.. టీడీపీ, చంద్రబాబు, నారా లోకేశ్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ ఇంటి ముందు నానా హంగామా సృష్టించడంతో ఒక స్థాయిలో దాడి చేస్తారనే స్థాయికి చేరింది. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులకు దీటుగా నినాదాలు చేసే ప్రయత్నం చేయగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రణరంగంగా మారే అవకాశం ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల ప్రవేశంతో టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గారు. వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎలాంటి గొడవ జరగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎప్పటికైనా దాడి?
టీడీపీ శ్రేణులు ముందస్తు సమాచారంతో ఇలా దాడికి యత్నించారనే అనుమానాలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ భద్రతా సిబ్బంది ఉండడంతో కుదరడం లేదు. ఏదో ఒక రోజు దాడి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడి ప్రయత్నంతో జగన్ నివాసానికి భద్రత మరింత కల్పించాల్సిన అవసరం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.