Monalisa: మహా కుంభమేళాలో మారువేషంలో వచ్చిన ఐఏఎస్ మోనాలిసా.. అసలు నిజం ఏంటంటే..?

Monalisa IAS: మహా కుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసాను ఏఐ ఉపయోగించి,  ఐఏఎస్ అని ఆమె మారువేషంలో మహా కుంభమేళాకి వచ్చి పూసలు అమ్ముతోందని కొంతమంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు.

1 /5

2025 మహా కుంభమేళాలో ఒక తేనేకళ్ళ అమ్మాయి సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

2 /5

ఎక్కడ చూసినా ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.  ముఖ్యంగా మహా కుంభమేళలో పొట్టకూటికోసం పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఈమె,  అక్కడ కొంతమంది వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తన వ్యాపారానికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.   

3 /5

అంతేకాదు ఈమెకు బాలీవుడ్ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్సి 16 లో కూడా అవకాశం వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. 

4 /5

అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే,  కొంతమంది ఏఐ ను ఉపయోగించి ఈమె ఐఏఎస్ అని, మారువేషంలో మహా కుంభమేళాకి వచ్చి పూసలు అమ్ముకుంటోంది అంటూ కొంతమంది ఫేక్ వీడియోలు సృష్టించారు. ఇది చూసిన కొంతమంది ఎంతకు తెగించార్రా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. 

5 /5

ఏది ఏమైనా ఏఐని ఎంతలా ఉపయోగిస్తున్నారు అంటే ఒక సామాన్యురాలిని కూడా ఐఏఎస్ ఆఫీసర్గా చూపించే అంత ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని, ఆమె ఇటీవల ఒక వీడియోలో తెలియజేసింది.