Teenmaar Mallanna Interview: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బీసీ గర్జన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జీ తెలుగు న్యూస్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 75 ఏళ్లుగా బీసీ నేత ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని.. బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తనకు సంతోషమన్నారు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడని మోత్కుపల్లి నరసింహులు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన అభిమానం కొద్ది ఆ మాట అనొచ్చని.. కానీ తాను ఎప్పుడు ఆ మాట చెప్పలేదన్నారు.
"నేను పని చేస్తున్న కార్యకర్తను మాత్రమే.. ప్రజలకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అవకాశం వస్తే ప్రధానమంత్రి అయితా.. ఎందుకు ఊకుంటా.. బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నేను హ్యాపీ. చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు కారంటే.. బీసీలం చైతన్యవంతమయ్యాం.. గత పరిస్థితులు లేవు. మా ఓట్లు మాకు వేసుకున్న తర్వాత మేమే కదా.. మా ప్రజలే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు.. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం సమయంలోనే చెప్పిండు.. రాష్ట్రం వచ్చినక మరో ఉద్యమం వస్తది.. ఆ ఉద్యమం కచ్చితంగా ఈ నిమ్న వర్గాలది అయి ఉంటది అని ఆయన చెప్పిండు.. ఇవాళ జరుగుతుంది అదే.. కానీ రేవంత్ రెడ్డి 10 ఏళ్లు అయినా.. 20 ఏళ్ళు అనుకోండి తప్పేముంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కావాలి లేకపోతే ఉప ప్రధాని కావాలని కోరుకుంటా..
మేము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినాము. ఈ దీనికి లీడర్ నేను కాదు. బీసీ ప్రజలు. ఎవరికి భయపడం. ఓట్లు మావి.. మా బీసీల ఓట్లు లేకుండా ఎవరైనా ఒక వార్డ్ మెంబర్ గెలిచారా..? మేము ఎవరికి భయపడాలి..? మేము ఎందుకు భయపడాలి..? మేము ఇన్ని సంవత్సరాలు భయపడుకుంటుంటేనే కదా.. మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఎప్పుడో గర్జించాల్సింది.. కానీ సందర్భం సమయం ఆసన్నమైంది. దాన్ని బట్టి పోతా ఉన్నాం..
హైదరాబాద్ రెడ్లు, వెలమలతోనే యుద్ధం 100%. రాజకీయ పరమైన యుద్ధం. వ్యక్తిగతమైనటువంటి యుద్ధం కాదు. రాజకీయ పరమైనటువంటి యుద్ధం తిట్లు ఇదే. మమ్మల్ని తిడితే మేము ఊరుకోం. ఈటితో కొడితే పత్తరితో కొడతాం.. మేము ఎందుకు ఊకుంటాం.. నేను మా ప్రజల బాధ మాట్లాడుతున్నా.. " అని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.
Also Read: Delhi Elections 2025: ఢిల్లీలో గెలుపెవరిది..? దేశ రాజధానిలో మైకులు బంద్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter