KT Rama Rao quash petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ ఎదురైంది. ఆయన ఫార్మూలా ఈ రేసు కేసులో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు.. క్వాష్ చేయాలని పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే.. దీన్ని అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని .. క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ క్రమంలో గులాబీ పార్టీకి మాత్రం ఇది పెద్ద దెబ్బగా చెప్పుకొవచ్చు.
కేటీఆర్ సుప్రీంకోర్టులో ఈ నెల 8న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై.. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచరణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రేవంత్ సర్కారు.. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇది కేవంలో రాజకీయా కారణాలతో కేసుల్ని పెట్టారని కూడా.. కేటీఆర్ తరపు లాయర్ లు ధర్మాసనం ముందు తమ వాదనలు విన్పించారు.
అయితే.. కౌంటర్ గా జస్టిస్ బేలా ఎం త్రివేది.. అపోసిషన్ లీడర్ లుగా ఉన్నప్పుుడు కేసుల్ని ఎదుర్కొవాలని కదా అని ప్రశ్నించారు. ఏదీ ఏమైన ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకొలేమని.. ధర్మాసనం కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది.
Read more: Ponnam Prabhakar: జాతరలో అలిగిన పొన్నం ప్రభాకర్.. మోకాళ్ల మీద మీడియా సమావేశం.. వీడియో వైరల్..
మరోవైపు. పిటిషన్ విత్ డ్రాకు అవకాశం ఇచ్చిన ధర్మాసనం.. మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వలేమిన స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేటీఆర్ తరపు లాయర్ లు పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని కోర్టు వారికి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter