Hyderabad vendor sells one banana rs 100 video: సాధారణంగా హైదరాబాద్ కు తరచుగా ఫారెనర్స్ వస్తుంటారు. ఇక్కడి చార్మినార్, గోల్కొండ కోట, ఇరానీ చాయ్, బిర్యానీ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా.. హైదరాబాద్ లో చదువు కోసం, ఉద్యోగాల కోసం, బిజినెస్ లో సైతం ఇటీవల విదేశీయులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
రష్య నుంచి వచ్చిన ఫారెనర్ కు వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా విదేశాల నుంచి కొత్త ప్రదేశాలకు టూరిస్టులు వెలితే కొంత మంది ఉన్న ధరల కన్నా.. నాలుగింతల రేట్లు చెప్తుంటారు. వారికి భాష, ఇక్కడ రేట్లు తెలీదని కొందరు వాళ్లను దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక టూరిస్టు.. రోడ్డు మీద తోపుడు బండి మీద అరటి పండు కొనేందుకు ప్రయత్నించాడు.
అతను అరటి పండ్లు అమ్మేవాడ్ని.. ఒక బనానా ఎంత అని అడగ్గా.. అతను రూ. 100 అని ఆన్సర్ చెప్పాడు. దీంతో ఫారెనర్ ఖంగుతిన్నాడు. ఒక అరటి పండు వంద రూపాయల అంటూ ఆశ్చర్యపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైదరాబాద్ లో రూ. 100 కి ఒక బనానా అంటూ వైరల్ చేశారు . దీంతో ఇది వార్తలలో నిలిచింది.
Read more: Viral Video: కామంతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. ఆఫీసులోనే లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..
కొంత మంది ఈ వీడియోపై మండిపడుతున్నారు. ఒక్క బనానా వంద రూపాయలు ఏంటని మండిపడుతున్నారు. హైదరబాద్ ఇజ్జత్ తీస్తున్నారని కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో వార్తలలో నిలిచింది.