IAS Officers: ఐఏఎస్‌లపై రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. 'ఏసీ గదుల్లో నుంచి బయటకు రావడం లేదు'

Revanth Reddy Controversial Comments On IAS Officers: ఐఏఎస్‌ అధికారులపై రేవంత్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసీ గదుల్లోనే ఉంటున్నారని ఐఏఎస్‌ అధికారుల పనితీరుపై విమర్శలు చేశారు. అలాంటి వైఖరి సరికాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2025, 07:42 PM IST
IAS Officers: ఐఏఎస్‌లపై రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. 'ఏసీ గదుల్లో నుంచి బయటకు రావడం లేదు'

Revanth Reddy Controversial Comments: అధికార యంత్రాంగంలో కీలక అధికారులుగా ఉన్న ఐఏఎస్‌లపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్‌ అధికారులు బాగా పని చేసేవారని.. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కేవలం ఏసీ గదుల్లోకే పరిమితం అయ్యారని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు.

Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?

గోపాలకృష్ణ  అనుభవాలతో అక్షరరూపం దాల్చిన 'లైఫ్‌ ఆఫ్‌ ఏ కర్మయోగి' పుస్తకం హైదరాబాద్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'గోపాలకృష్ణ  అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషం. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్. ఏదైనా కొనవచ్చు కానీ అనుభవాన్ని కొనలేం' అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ అందరికీ ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి అని వెల్లడించారు.

Also Read: Harish Rao PA Arrest: తెలంగాణలో కీలక పరిణామం.. హరీశ్‌ రావు పీఏ అరెస్ట్‌

ఆదర్శవంతంగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్‌లను గుర్తు చేసుకోవాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ అని గుర్తుచేశారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ అని చెప్పారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి  మన్మోహన్ సింగ్ అని తెలిపారు. వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి హితవు పలికారు.

'గతంలో అధికారులు రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయింది. రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలి' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తుంచుకునేవారు. కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు వెళ్లడం లేదు' అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలని ఐఏఎస్‌ అధికారులకు రేవంత్‌ రెడ్డి సూచించారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని తెలిపారు. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారని.. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నట్లు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News