Madhu Priya: మళ్లీ వివాదంలో మధు ప్రియ.. ఏకంగా కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలోనే..

Bhupalpally news:  పవిత్రమైన ఆలయంలో జరిగిన ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 21, 2025, 02:30 PM IST
  • గుడిలో ఫోటో షూట్..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Madhu Priya: మళ్లీ వివాదంలో మధు ప్రియ.. ఏకంగా కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలోనే..

Private album Movie shoot in Sri kaleshwara mukteswara swamy temple: తెలంగాణలో పవిత్రమైన ఆలయంలో కొంత మంది చేసిన పని పట్ల భక్తులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కొంత మంది ప్రైవేటు ఆల్బం సెట్స్ వేశారు. అంతే కాకుండా.. గుడితలుపులు మూసీ మరీ .. భక్తుల్ని రానీయకుండా చేసి షూటింగ్ చేశారు. ఈ ప్రైవేటు ఆల్బం ను చేసింది సింగర్ మధు ప్రియ అని ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రస్తుతం దుమారం చెలరేగింది.

కనీసం గుడిలో వాళ్లు, దేవదాయ శాఖ అయిన దీనిపై రియాక్ట్ కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొవాలనిన కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యల్ని చూస్తున్న వదిలేసిన అందరిపై చర్యలు తీసుకొవాలని భక్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

దేవుడి ఆలయంలో ఫోన్ లు తీసుకెళ్లేందుకు, ఫోటోలు తీసేందుకు చాలా ఆలయాలు అనుమతించవు. అలాంటిది వీళ్లు ఏకంగా సెట్ లు వేసి.. గర్భగుడిలోనే ప్రైవేటు ఆల్బం షూటింగ్ చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఎట్టిపరిస్థితుల్లోను దీన్ని వదిలేది లేదని కూడా భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

Read more: Singer Sunitha: సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు..

ఇటీవల కొంత మంది భక్తులు దేవుడి ఆలయంలో ఫోటో షూట్ లు, రీల్స్ చేస్తు కాంట్రవర్సీగా మారుతున్నారు. పవిత్రమైన ప్రదేశాలకు వచ్చి ఇలాంటి పనులు ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు మానుకొవాలని కూడా హెచ్చరిస్తున్నారు. దేవాదాయ శాఖ దీనిపై కఠినంగా నిర్ణయం తీసుకొవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News