Urmila matondkar reacts on Ram gopal varma: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. న్యూ ఇయర్ లో స్టార్టింగ్ లో ఇక మీదట కాంట్రవర్స అంశాల జోలికి పోనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల సత్య మూవీ రిరీలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ.. 1998 లో వచ్చింది. ఈ మూవీలో జేడీ చక్రవర్తి హీరోగాను, ఊర్మిళా మతోండ్కర్ హీరోయిన్ గా చేశారు.
అయితే.. గత కొన్నేళ్లుగా.. ఆర్జీవీకి, ఊర్మిళా మతోండ్కర్ కు మధ్య గొడవలు జరిగాయని..అందుకే ఇద్దరు కూడా ఎక్కడ కలవడం లేదని అనేక రూమర్స్ వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వెంట్ లో ఊర్మిళా మతోండ్కర్ కు దీనిపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై నటి ఊర్మిళా మతోండ్కర్ స్పందించారు. ఇవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ఆర్జీవీ ఒక గొప్ప డైరెక్టర్ అని చెప్పుకొచ్చారు.
ఆయన డైరెక్ట్ చేసిన .. అంతం, గాయం, రంగీలా వంటి హిట్ మూవీస్ లో హీరోయిన్గా చేశానని చెప్పారు. ఆయతో మూవీస్ లో చాన్స్ దొరకడం తన లక్ అని చెప్పారు. ఇలాంటి లేనీ పోనీ రూమర్స్ నమ్మోద్దని కూడా కొట్టిపారేశారు. ఈ క్రమంలో నటి ఊర్మిళా మతోండ్కర్ చివరిసారిగా.. 2018 లో బ్లాక్ మెయిల్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించారు.
ఈ మూవీ రిరిలీజ్ ఈనెల 17 న జరిగిన విషయం తెలిసిందే. దీనిపైఆర్జీవీ కామెంట్లు చేశారు. ఇంత మంచి మూవీస్ చేసిన తాను.. ప్రస్తుతం చెత్త సినిమాలు తీస్తున్నానని ఎమోషనల్ అయ్యారు. ఇక మీదట మంచి సినిమాలు తీయకుంటే.. అభిమానులు తనను చంపేయండని కూడా వర్మ ఎమోషనల్ గా మాట్లాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter