Telangana Rains Alert: తెలంగాణ‌లో మరో 3 రోజులపాటు ఓ మోస్తరు వ‌ర్షాలు

Heavy Rain Lash Telangana: ఇటీవల ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2021, 02:03 PM IST
Telangana Rains Alert: తెలంగాణ‌లో మరో 3 రోజులపాటు ఓ మోస్తరు వ‌ర్షాలు

Heavy Rain Lash Telangana: ఇటీవల ఒకే సమయంలో ఏర్పడిన రెండు అల్పపీడన ద్రోణుల ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుంటంతో తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. 

Also Read: Dengue cases in Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

ఇటీవల ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాల్లో మరో రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: 7th Pay Commission Latest News: డీఏ పెంపునకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News