GHMC Election 2020: High Court stay on Telangana SEC orders: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ( High Court ) ఆదేశాలిచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో బ్యాలెట్‌పై స్వస్తిక్ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా.. ఓటు వేసినట్లు పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎన్నికల సంఘం సర్క్యూలర్‌ను జారీ చేసింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. Also read: GHMC Election Results: కొనసాగుతున్న కౌంటింగ్..
ఈ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం విచారించిన ధర్మాసనం ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు లోబడే జీహెచ్ఎంసీ ఫలితాలు విడుదల (GHMC Election Results) చేయాలని న్యాయస్థానం ఎన్నికల సంఘానికి సూచించింది. Also read: GHMC Election Results: మధ్యాహ్నానికి తొలి ఫలితం!
అయితే ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల ( GHMC Election 2020 ) సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం నెంబర్ తెలిపే స్టాంప్‌ను ఇచ్చామని ఎన్నికల సంఘం అధికారులకు చెప్పారు. దీంతో దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లను లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. Also Read| GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe