Jaggareddy warning to brs Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అమలుకు సాధ్యంకానీ హమీలు ఇచ్చి అధికారంలొకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, నేతలు ప్రశ్నిస్తున్నారని.. అందుకే తమపై, పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, వేధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, విమర్శిస్తు ఒక పోస్ట్ పెట్టిన వెంటనే పోలీసులను రంగంలోకి దింపి వేధింపులకు గురిచేస్తు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కవిత అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అక్రమాల చిట్టాను తాము ఎప్పటి కప్పుడు పింక్ బుక్ లో రాస్తున్నామని అన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని.. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఈ మోసాల చిట్టాను బైటకు తీస్తామన్నారు. ఏ ఒక్కరిని వదిలేదని లేదని కాంగ్రెస్ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలో కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. బీఆర్ఎస్ పాలన వల్ల అసలు.. తెలంగాణలో నిధులు లేవని అన్నారు. గతంలో బీజేపీపై విమర్శలు చేసి కవిత... నాలుగు నెలలు జైలులో ఉందన్నారు. ఇప్పుడు అనవరసంగా పింక్ బుక్, మరేంటో అనుకుంటూ.. సీఎం రేవంత్ ను ఎందుకు గెల్కుతున్నవ్ అంటూ ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ సీఎంగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నాడని.. అపోసిషన్ పార్టీగా ఏదైన సూచనలు ఉంటే ఇవ్వాలని కానీ.. పింక్ బుక్ అని.. ఇలా మాట్లాడి సీఎం ను, కాంగ్రెస్ పార్టీనీ రెచ్చకొట్టవద్దన్నారు. మరల సీఎం ఏదైన కౌంటర్ గామాట్లాడితే.. దాన్ని మరల పెద్దదిగా చేస్తారన్నారు. గతంలో బీజేపీ ని గెలకడం వల్ల మీ నాన్న దుకాణం ఖాళీ చేయించి, నిన్ను జైల్లో పెట్టారన్నారు. ఇప్పుడు నువ్వు మరల.. సీఎం రేవంత్ ను అనవసరంగా గెలకొద్దని జగ్గారెడ్డి తనదైన స్టైల్ లో కవితకు ధమ్కీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter