Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇన్నాళ్లు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Govt Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం
మాజీ మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) వంశీకృష్ణతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో వంశీకృష్ణతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఏ1గా హరీశ్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావు ఉన్నారు.
Also Read: Indiramma Indlu: 'ఇందిరమ్మ ఇల్లు' వచ్చిందా? లేదా? ఫోన్‌లో చెక్ చేసుకోవడం ఇలా..
సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోశ్ కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు హరీశ్ రావు పీఏ వంశీకృష్ణపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడు కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశారు. గతేడాది ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.