Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిల్లులు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన నిధులు, బిల్లులకు సంబంధించిన నిధులను ఇతర వాటికి మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.
Also Read: Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు, 2వ పీఆర్‌సీ ఎప్పుడు?'
ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బిల్లుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన అవసరం ఉంది.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
నిధుల చెల్లింపులు ఇలా..
ఉద్యోగుల బిల్లుల కోసం ప్రభుత్వం నెలకు దాదాపు రూ.1000 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రతి నెల యథావిధిగా కేటాయిస్తుంటారు. అయితే ఈనెల ఆ నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం కోత విధించాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. రూ.వెయ్యి కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశించినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రూ.700 కోట్ల నిధులు సంక్షేమ పథకాలకు వినియోగించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంతో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. పదవీ విరమణ పొంది నెలలు గడుస్తున్నా ఆర్థిక ప్రయోజనాలు అందక తీవ్ర కష్టాలు పడుతున్నారు. రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు భారీ స్థాయిలో ఉన్నారు. వేల సంఖ్యలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉండగా వారంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగుల్లో ఆందోళన
ప్రభుత్వం నిధుల మళ్లింపు చేసిందా? లేదా అనేది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఉద్యోగ వర్గాల్లో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఉండడంతో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచబోతున్నారని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 65 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంచుతారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే నిధుల మళ్లింపు వార్తలు రావడంతో ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.