Nizamabad Turmeric Board: పసుపు రైతుల సుదీర్ఘ కల సంక్రాంతి పండుగ సందర్భంగా తీరింది. ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిన పసుపు బోర్డు కథ ముగిసింది. ఎట్టకేలకు ఇందూరులో పసుపు బోర్డు ప్రారంభమవడంతో పసుపు రైతులకు సంక్రాంతి కానుక లభించింది. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో నిజామాబాద్ జిల్లాలో ఆనందాలు వెల్లవిరుస్తున్నాయి. ఇక పసుపు పంటకు మద్దతు ధర.. కావాల్సిన మిగతా సౌకర్యాలు లభించనున్నాయి.
Also Read: Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట.. బెయిల్‌పై విడుదల
పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. పసుపు రైతులకు గిట్టుబాటు సమస్యే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు.
Also Read: Padi Kaushik Reddy: తెలంగాణలో 'అరెస్ట్‌ల సంక్రాంతి'.. రణరంగంగా 'పండుగ'
నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని మంగళవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి బండి సంజయ్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించాడని కొనియాడారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఇవ్వాళ శుభవార్త అందించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ ప్రాంత ప్రజలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రానున్నాయని చెప్పారు. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుందని.. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదని వెల్లడించారు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుందని వివరించారు. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాకింగ్‌తోపాటు జాతీయంగా, అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశం ఉందని బండి సంజయ్ తెలిపారు. 'ప్రతి ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఉంటుంది. పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమాకు చర్యలు తీసుకుంటుంది' అని బండి సంజయ్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter