OPPO Find N5: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే టీజర్ల ద్వారా ఊరించిన OPPO Find N5 ఎట్టకేలకు లాంచ్ కానుంది. కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీ ప్రకటించింది. మార్కెట్‌లో ఈ ఫోన్ గేమ్ ఛేంజర్ కానుందనే అంచనాలు ఉన్నాయి.
OPPO Find N5 వచ్చే వారంలో ప్రపంచ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. చైనాతో పాటు అన్ని మార్కెట్‌లలో ఒకేసారి గ్రాండ్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 20వ తేదీన సింగపూర్‌లో జరిగే ఈవెంట్‌లో ఈ ఫోన్ లాంచ్ చేయనుంది ఒప్పో సంస్థ. దీంతోపాటు OPPO Watch X2 కూడా ఎంట్రీ ఇవ్వనుంది. OPPO Find N5 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ కావడం విశేషం. ఇండియాలో ఇదే ఫోన్‌ను OnePlus Open 2 పేరుతో లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోన్ 3డి ప్రింట్ టైటానియం ఎల్లాయ్ హించ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది.
OPPO Find N5 కు సంబంధించిన కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. ఇందులో క్వాల్‌కామ్ నుంచి కొత్తగా వచ్చిన సెవెన్ కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. 512 జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్ ఉంటుంది. ఇక ట్రిపుల్ కెమేరాలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 50 మెగాపిక్సెల్ టెలీఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఇవి కాకుండా మరో రెండు 8 మెగాపిక్సెల్ కెమేరాలు ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 యూజర్ ఇంటర్ ఫేస్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది.
ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 67, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ కలిగి ఉండటం మరో ప్రత్యేకత. అంటే నీటిలో పూర్తిగా తడిసినా సురక్షితంగా ఉంటుంది.
Also read: Gold Price Decline: పసిడి ప్రియులు ఆనందంతో షాక్, బంగారం ధర 50 వేలకు పడిపోతుందా ఎప్పటి నుంచి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి