Flipkart Mobile Offers: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకే గత ఏడాది లాంచ్ అయిన మోటోరోలా జి64 ప్రాచుర్యమైంది. అయితే ఇప్పుడు ఇదే స్మార్ట్‌ఫోన్ కేవలం 13 వేలకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
మోటోరోలా జి64 స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇక కెమేరా పరంగా చూస్తే డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. అది కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వస్తోంది.
యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 52 రేటింగ్ కలిగి ఉంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చింది కంపెనీ. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ లాంచింగ్ ధర 14,999 రూపాయలు కాగా ఇప్పుడు 13,999 రూపాయలకే లభిస్తోంది. ఇది కాకుండా బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు తగ్గుతుంది. అంటే 12,999 రూపాయలకే వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర 16,999 రూపాయలు కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 14,999 రూపాయలకు లభిస్తోంది. ఇతర బ్యాంకు కార్డులపై మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Also read: Asteroid Hit: భూమ్మీదకు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్, ఇండియా సహా ఈ దేశాలు నాశనమేనా>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి