Valentine Day Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్లు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీ కోసమే. ఏకంగా 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ కెమేరా ఫోన్లు తక్కువ ధరకే లభ్యమౌతున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే పొందవచ్చు.
వాలెంటైన్ డే సందర్భంగా ప్రేమికులకు బహుమతిగా ఇచ్చేందుకు స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ ఆప్షన్. అందుకే ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్ డే ఆఫర్లు ప్రకటించింది ఇందులో ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ బ్యాంకులు ఇచ్చే డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లకు ఎక్స్చేంజ్ జోడిస్తే మరింత తక్కువ ధరకే టాప్ బ్రాండ్ ప్రీమియం ఫోన్లు దక్కించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జి స్మార్ట్ఫోన్ గురించి పరిశీలిద్దాం. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది డైమెన్సిటీ 7020 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ప్రైమరీ కెమేరా 108 మెగాపిక్సెల్ ఉంటే సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 15,999 రూపాయలకు అందుబాటులో ఉంది. దీనిపై 1200 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ బోనస్ 10,900 రూపాయలు ఉంది.
రియల్ మి నోట్ 13 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ అయితే మార్కెట్‌లో ప్రాచుర్యం పొందిందే. ఈ పోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రోసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు. ఇక బ్యాటరీ అయితే 5100 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా 750 రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
Also read: 8th pay Commission Gift: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్, ఆ ఉద్యోగులకు జీతం లక్ష దాటుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి