తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్‌నగర్ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
తెలంగాణలో నానాటికి కరోనావైరస్ (Coronavirus ) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 9 మంది మరణించారు.
తెలంగాణ లో నిరంతరం కరోనావైరస్ ( Coronavirus ) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ( TS Govt ) శనివారం నాటి కరోనా బులెటిన్‌ను ఆదివారం విడుదల చేసింది.
Open School Students: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెన్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఓపెన్ స్కూల్ ( Open School Students ) విద్యార్థులకు సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అలా అని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రజలకు సూచించారు. అయితే.. కరోనా సోకిన వారు అధిక బిల్లులు చెల్లిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ (Telangana) లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసుల ( Coronavirus) ఉధృతి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రెండుమూడు రోజుల నుంచి 1500లకు తక్కువగానే కరోనా కేసులు నమోదవుతుండటం కొంత ఉపశమనం కల్గిస్తోంది.
వాస్తు పేరుతో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM K. Chandrashekar Rao) పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సీఎం, సీఎస్‌లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర బృందం సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
Online classes: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు ( School fee) కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హై కోర్టు శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.