Public Holiday November 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవులు ప్రకటించినట్టే నవంబర్ నెలలో కూడా సెలవులున్నాయి. కొన్ని అప్రకటిత సెలవులుంటాయి. కొన్ని జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. అదే విధంగా నవంబర్ 20వ తేదీన అంటే ఎల్లుండి బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. కేవలం బ్యాంకులే కాదు విద్యా సంస్థలు సైతం మూతపడనున్నాయి.
ఆర్బీఐ జారీ చేసిన నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితాలో కొత్త సెలవు చేరింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీ అంటే ఎల్లుండి పనిచేయవు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. కేవలం బ్యాంకులే కాదు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, విద్యా సంస్థలు కూడా మూతపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కారణంగా స్కూల్స్, కళాశాలలకు నవంబర్ 20న సెలవు ప్రకటించారు. ప్రభుత్వ సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల విధులు కూడా కేటాయించారు. చాలా స్కూల్స్, కాలేజెస్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇక బ్యాంకులకు కూడా ఆర్బీఐ నవంబర్ 20న సెలవు ప్రకటించింది.
నవంబర్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా
నవంబర్ 17 ఆదివారం సెలవు
నవంబర్ 18 కనకదాస్ జయంతి కర్ణాటకలో సెలవు
నవంబర్ 20 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సెలవు
నవంబర్ 23 నాలుగో శనివారం సెలవు
నవంబర్ 24 ఆదివారం సెలవు
నవంబర్ నెలలో రెండవ శనివారం నవంబర్ 9, నాలుగో శనివారం 23న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంది. ఇవి కాకుండా నాలుగు ఆదివారాలు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సెలవులున్నాయి. బ్యాంకులకు జాతీయ సెలవులు కాకుండా ఇతర సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. నవంబర్ 20న అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా బ్యాంకులకు సెలవుంది. కేవలం బ్యాంకులే కాకుండా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ ఆఫీసులు, విద్యా సంస్థలకు సైతం సెలవు ఉంది.
Also read: Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.