Covid19: తెలంగాణలో 1,269 కరోనా కేసుల నమోదు

తెలంగాణ (Telangana) లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసుల   ( Coronavirus) ఉధృతి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రెండుమూడు రోజుల నుంచి 1500లకు తక్కువగానే కరోనా కేసులు నమోదవుతుండటం కొంత ఉపశమనం కల్గిస్తోంది. 

Last Updated : Jul 12, 2020, 09:58 PM IST
Covid19: తెలంగాణలో 1,269 కరోనా కేసుల నమోదు

Telangana Corona cases: హైదరాబాద్: తెలంగాణ (Telangana) లో గత కొన్ని రోజులుగా కరోనావైరస్ (Coronavirus) కేసుల ఉధృతి భారీగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రెండుమూడు రోజుల నుంచి 1500లకు తక్కువగానే కరోనా కేసులు నమోదవుతుండటం కొంత ఉపశమనం కల్గిస్తోంది. ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,269 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,671కి పెరగగా.. మరణాల సంఖ్య 356కి చేరింది. Also read: MP Arvind: ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి

ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల్లో 11,883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ రోజు డిశ్చార్జ్ అయిన 1,563 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 22,482 మంది కోలుకున్నారు.  గత 24 గంటల్లో 8,153 మందికి పరీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,70,324 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ ప్రకటించింది. Also read: Covid19 crime: భార్య శాంపిల్స్..పనిమనిషి పేరుతో

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 800 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో -132, మేడ్చల్‌లో -94, సంగారెడ్డిలో-36, ఖమ్మంలో -1, వరంగల్ అర్బన్‌లో -12, వరంగల్ రూరల్‌లో -2,  నిర్మల్‌లో -4, కరీంనగర్‌లో -23, జగిత్యాలలో -4, యాదాద్రిలో -7, మహబూబాబాద్‌లో-8, పెద్దపల్లిలో -9, మెదక్‌లో -14, మహబూబ్ నగర్‌లో -17, మంచిర్యాలలో -3, నల్గొండలో -15, సిరిసిల్లలో -3, ఆదిలాబాద్‌లో -4, వికారాబాద్‌లో -6, నాగర్ కర్నూల్‌లో -23, జనగాంలో -6, నిజామాబాద్‌లో -11., వనపర్తిలో -15, సిద్దిపేటలో -3, సూర్యాపేటలో -7, గద్వాలలో -7 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.  Also read: Tweet: అమితాబ్ తో చిరు ఏమన్నారు? 

Trending News