Corona Update: హైదరాబాద్: తెలంగాణ లో నిరంతరం కరోనావైరస్ ( Coronavirus ) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం (TS Govt) శనివారం నాటి కరోనా బులెటిన్‌ను ఆదివారం విడుదల చేసింది. శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో 1,593 కేసులు నమోదుకాగా.. 8 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 54,059కి పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 463 మంది మరణించారు. నిన్న మొత్తం 15,654 మందిని పరీక్షించారు. Also read: COVID-19 vaccine: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..
ఇప్పటివరకు 41,332 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లల్లో 12,264 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.86 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. Also read: India: ఒక్కరోజులో 48,661 కరోనా పాజిటివ్ కేసులు
అయితే.. నిన్న రాత్రే బులిటెన్‌ను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో మార్పులు చేసి ఆదివారం విడుదల చేసింది. బులెటిన్‌లో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, బెడ్ల సంఖ్య, వెంటిలేటర్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య, ర్యాపిడ్ టెస్టులు తదితరసమగ్ర వివరాలతో బులిటెన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
Telangana: కొత్తగా 1,593 కరోనా కేసులు..