Corona cases: హైదరాబాద్: తెలంగాణలో నానాటికి కరోనావైరస్ ( Coronavirus ) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 9 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 57,142 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 830కి పెరిగింది. అయితే నిన్న ఒక్కరోజే 15,839 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలంగాణ ( Telangana ) వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Anil Baluni: మీరే మా ఇంటికి డిన్నర్‌కు వచ్చేయండి
అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42,909 మంది కరోనా నుంచి కోలుకోగా.. 13,753 మంది చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న రాత్రి ఒక్కరోజే 803 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు... Also read: Corona Cases: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
Telangana: కొత్తగా 1,610 కరోనా కేసులు..