తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu season 4 సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి భయాల మధ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి అంతా సిద్దం అయింది.
బిగ్ బాస్ 4వ సీజన్ ( Bigg Boss 4) ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేకపోవడంతో ఈసారి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ఏ రోజుకు ఆ రోజు కొన్ని కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి.
బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 4వ సీజన్ ( Bigg Boss 4)లో అడుగుపెట్టబోతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున ( Nagarjuna akkineni ) హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.