KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
KTR About Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా.. కేంద్రం కుట్రలు చేసిన తీరుపైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.
Minister KTR Emotional Speech: మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రజల రుణం తాను ఏమిచ్చినా తీర్చుకోలేనిదని అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Revanth Reddy's Reply to Minister KTR's Notices: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇందులో తన పేరు లాగి తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపక్ష నేతలైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లపై పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
Minister KTR Writes Letter To Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తాజాగా సీఆర్పీఎఫ్ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలలోనే పరీక్ష అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
Minister KTR Writes Letter to Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు అనుమతి ఇచ్చి.. హైదరాబాద్‌కు అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
Bandi Sanjay About TSPSC Paper Leakage Scam: టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్. ఆయనది నాలుకా? తాటిమట్టా? ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారు అని బండి సంజయ్ ప్రశ్నించారు.
KTR legal notices to Revanth Reddy and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఈ ఇద్దరు నేతలు మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా వెరైటీగా విమర్శలు గుప్పించుకున్నారు. ఉగాది పంచాంగం చెబుతూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. బండి సంజయ్ కూడా అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 'మా నౌకర్లు మాక్కావాలె' నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ దీక్ష చేపట్టనుంది. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమం ఆగదని బండి సంజయ్ హెచ్చరించారు.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలన డిమాండ్ చేశారు.
BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ముసలం నెలకొంది. అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయాల్సింది పోయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్‌లో అసంతృప్తి నేతల దారేటు..? వీరి వ్యాఖ్యల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా..?
Minister KTR Meet With UAE Ambassador: యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురిని విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ఆయనను కేటీఆర్ కోరారు.
Minister KTR Reacts On ED Notice to MLC Katitha: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ అంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది ఈడీ కాదని.. మోడీ సమన్లుగా భావించాలని అన్నారు. దేశాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Revanth Reddy On Minister KTR: పొద్దున లేచిప్పటి నుంచి రాత్రి వరకు మంత్రి కేటీఆర్ సినిమా వాళ్లతోనే తిరుగుతుంటాడని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో నటి సమంత పేరును కూడా తెరపైకి తీసుకువచ్చారు ఆయన. సీఎం కేసీఆర్‌పై కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
Eetala Rajender Speech: ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో పుస్తెలతాళ్ళు కట్టడానికి కేసీఆర్ ఇచ్చే డబ్బులు మూడు వేల కోట్లు అయితే.. మళ్లీ అదే పుస్తెలను తెంపి కేసీఆర్ 45 వేల కోట్లు సంపాదిస్తుండు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Kishan Reddy Speech At Praja Gosa BJP Bharosa Corner Meeting: తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కాని.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తండ్రీకొడుకులకు అబద్ధాలు ఆడటంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.