EPFO 3.0: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులు చేయనుంది. కొత్త మార్పుల ప్రకారం ప్రతి పీఎఫ్ సభ్యుడు అదనపు పెన్షన్ కంట్రిబ్యూట్ చేయవచ్చు. అంటే రిటైర్మెంట్ తరువాత అదనపు ప్రయోజనాలు పొందేందుకు ప్రతి సభ్యుడు అదనంగా పెన్షన్ జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈపీఎస్ నుంచి 8 శాతం పెన్షన్ జమ అవుతోంది.
పీఎఫ్ సభ్యుల ప్రయోజనాలు, సౌకర్యాల కోసం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కొత్త కొత్త అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగానే కొత్త పీఎఫ్ స్కీమ్ తీసుకురానుంది. ప్రస్తుతం కనీస వేతనం 15 వేలుంటే ఉద్యోగి, యజమాని తరపున చెరో 12 శాతం వాటా ఉంటుంది. ఎంప్లాయర్ వాటా నుంచి 8.33 శాతం ఉంటుంది. ఉద్యోగ వాటా మొత్తం 12 శాతం ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు వర్తిస్తుంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో యాక్టివ్‌గా లేని ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌లో జమ అయిన నగదు 8,505.23 కోట్లుంటే 2018-19తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. ఆ సమయంలో ఇది 1638 కోట్లుంది. ఇటీవల సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్ఓలో 18 లక్షల 81 వేలమంది కొత్తగా చేరారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 9.33 శాతం అధికం.
ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం ఉద్యోగి నుంచి అదనపు పీఎఫ్ వసూలు చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయంలో పెద్దఎత్తున నగదు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానం ఆప్షనల్ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతి నెలా అధిక మొత్తం ఉద్యోగి వాటాగా పీఎఫ్ కట్ అయినా రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ ఫండ్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త ఈపీఎఫ్ఓ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also read: EPFO Big Decision: పీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, ఇక నుంచి అదనపు వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.