KTR Satires On BJP: అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్

KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2023, 12:28 AM IST
KTR Satires On BJP: అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్

KTR Satires On Amit Shah's Speech: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి వస్తుందని చేవెళ్ల సభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ... ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని పీఠం ఎక్కిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారన్న మంత్రి కేటీఆర్.. కారు స్టీరింగ్ కాదు, బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది అని ఆరోపించారు. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం పార్టీ విలవిలలాడుతోంది అని ఎద్దేవా చేశారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశ ప్రజలు 70 ఎంఎం స్క్రీన్‌లో చూశారని... ఇక వారికి ఏ ట్రైలర్ అవసరం లేదు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఇంకా ఏయే అంశాలు ప్రస్తావించారంటే..
తెలంగాణలో 
గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు
ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు

ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి
సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..

ముక్కునేలకు రాసినా... 
మోకాళ్ల యాత్ర చేసినా... 
మోసాల మోదీని తెలంగాణ నమ్మదు.
బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు

కరప్షన్ కు కెప్టెన్... మోదీ 
క్యాప్షన్... బీజేపీ

ఎంఐఎం భుజంపై 
తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి 
ఎంతకాలం కాలుస్తారు.

తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ

పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ 

కేంద్ర నిధులు దుర్వినియోగమా ?

బారాణా తీసుకుని చారాణా కూడా
ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే

అదానీ విషయంలో JPC కాదు కదా కనీసం SIT కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది

గుజరాత్ లో మోడీ హయాం లో మీరు హోం మంత్రి గా ఉన్నప్పుడు పేపర్ లీకుల లో గుజరాత్ No - 1 గా ఉన్నమాట నిజం కాదా? 

గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా ?

ఈ దేశం లో వ్యాపం లాంటి అతి జుగుప్త్సా కరమైన స్కాం చేసింది మీ BJP పార్టీ ప్రభుత్వం కాదా??

అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు  మాట్లాడం మీకే చెల్లింది.

PM cares లో ఎంత జమైంది - ఏ విధంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు ...

CAG ఆడిట్ PM cares కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిన వారు...

CAG మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్ ల తో కట్టిన ప్రాజెక్ట్ ల పై మాట్లాడం.. అవివేకం కాక మరి ఏమిటి ??

ఇది కూడా చదవండి : Bandi Sanjay Comments: సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు.. ఈటల ఆ మాట అనలేదు: బండి సంజయ్

గత ఎనిమిది ఏళ్లుగా కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరు అంటూ మంత్రి కేటీఆర్ బీజేపిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలపై రేపు బీజేపి ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

ఇది కూడా చదవండి : Revanth Reddy To Etela Rajender: అమ్మవారిమీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News