Nagababu viral tweet: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అంటూ పెద్ద ఎత్తున రచ్చ రేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకొని మెగా అభిమానుల సహాయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ప్రస్తుతం మూలాలను మరిచిపోయి, తనను ఎవరు ఈ స్థాయికి తీసుకు రాలేదని, తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు.
అయితే గతంలో చిరంజీవి తనకు దేవుడని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు. ఆ తర్వాత మెగా అభిమానులే తన అభిమానులు అంటూ చెప్పుకొచ్చారు. దాంతో మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ ను ఓన్ చేసుకున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమాని కూడా హిట్ చేస్తూ వచ్చారు.
అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కారణంగా అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా , తన స్నేహితుడైన శిల్పా రవి అందులోనూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసిపి సభ్యుడికి సపోర్ట్ చేయడంతో అసలైన రంగు బయటపడింది అని మెగా అభిమానులు కామెంట్లు వ్యక్తం చేశారు.
ఇక దాంతో అప్పటినుంచి మెగా వెర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇకపోతే ఇది నిన్నటి వరకు ఆన్లైన్లోనే వార్ జరిగేది కానీ ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా వార్ జరగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతోంది.
ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు పుష్ప -2 సినిమాకి దూరంగా ఉన్నారు. పైగా మెగా కుటుంబ సభ్యులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక థియేటర్ ల ఎదురుగా అల్లు వర్సెస్ మెగా అభిమానులు ఏకంగా అసభ్యకర ప్లకార్డులు పెడుతూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ సంఘటనలు చూసి సినీ లవర్స్ కూడా మెగా అల్లు అభిమానులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు అనే కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అసలే వాళ్ళు మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో నాగబాబు.. స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తించి, వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong".
- Swami Vivekananda.— Naga Babu Konidela (@NagaBabuOffl) December 1, 2024
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter