World news: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన లిబియా తీరంలో జరిగింది.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 74 కరోనా పాజిటివ్ కేసులు ( coronavirus positive cases ) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది.
తెలంగాణలో శుక్రవారం కొత్తగా 100 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల మధ్య జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 100 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో గురువారం నాడు కొత్తగా 66 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయి. అందులో ఇద్దకు వలస కూలీలు ఉండగా మరో 49 మంది సౌది అరేబియా ( Saudi Arabia deportees ) నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1908కి చేరింది.
కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus ) విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules ) సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మరీ అంత ఉధృతంగా ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ) అన్నారు. అయితే అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus positive cases in Telangana ) మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో 107 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి ( Saudi Arabia deportees ) కరోనా సోకినట్టు గుర్తించగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనూ 19 మందికి ( Migrant workers ) కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధారణ ప్రజానీకంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నగరాల నుండి భారీ సంఖ్యలో జనం కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నందున వారు వెళ్లే మార్గంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆ వలసదారులకు అన్నపానీయాలు అందించి, సేదతీరేందుకు నీడ కల్పించాల్సిందిగా రాహుల్ గాంధీ కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.