KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
KTR Warning to Minister Konda Surekha: పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఆయన పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కేటీఆర్‌తోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
HYDRA: హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు బ్రేకులు పడబోతున్నాయా..! పేదల ఇళ్లు కూల్చివేతల్ని బీజేపీ అడ్డుకునేందుకు సిద్దమైందా..! కూల్చివేతలపై బీఆర్ఎస్ కూడా మరో పోరాటానికి సిద్దం అవుతోందా..! ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు రెండు పార్టీలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి.. మరి వీటిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీ వ్యూహం సిద్ధం చేసుకుందా అంటే..
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
Target ktr: బీఆర్ఎస్ ముఖ్యనేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా.?ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా...?అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..రాజకీయంగా, ఆర్థికంగా ఆ లీడర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారా. ..?ఇంతకీ రేవంత్ టార్గెట్ చేసిన ఆ లీడర్ ఎవరు..రేవంత్ ఆ లీడర్ నే ఎందుకు టార్గెట్ చేసినట్లు..?
KTR Vs Revanth Reddy: రాజీవ్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో రేవంత్ గునపాలు దింపారని.. ఆ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అవుతుందన్నారు.
BRS BJP Merge News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలపై మాజీ కేటీఆర్ స్పందించారు. ఇది పూర్తిగా దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలు ప్రజలకు వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.
AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.
KTR Comments on YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఆశ్చర్య కలిగించందన్నారు కేటీఆర్. పేదలకు ఎన్నో పథకాలు ఇచ్చినా ఓడిపోయారని అన్నారు. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే.. ఫలితాలు మరోలా ఉండేవన్నారు.
AEE Candidates Meets To KT Rama Rao In Hyderabad: తుది ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నియామకాలు చేపట్టకపోవడంతో ఎంపికైన ఏఈఈ ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
KT Rama Rao Winning Comments On Mahabubnagar Local Body MLC Election: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము ఎవరిని బెదిరించలేదని.. హీరోయిన్లతో తమకేం పని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
KT Rama Rao Fire On Party Jumpings: పదేళ్లలో అధికారం, పదవులు పొంది ఇప్పుడు పార్టీని వీడుతున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మళ్లీ వస్తామని కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వారిని రానిచ్చేది లేదని గులాబీ పార్టీ స్పష్టం చేశారు.
KTR Fires On Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా అనర్హత వేటు వేయిస్తామన్నారు.
KTR Health Update: మాజీ మంత్రి కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం కారణంగా కరీంనగర్ కదన భేరి సభకు దూరమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.