BRS Party Rythu Deeksha: రైతులతోపాటు ప్రజలందరికీ మోసం చేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కొడంగల్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Allu Arjun Mama: హీరో అల్లు అర్జున్‌కు మరో షాక్.. 'మామ' చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూల్చివేత?
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'రేవంత్ రెడ్డి అయన అల్లుడికి భూములు ఇవ్వడానికి లగచర్ల, హకీంపేట రైతులను ఇబ్బందులు పెడుతున్నాడు ఇల్లు దాటని లంబాడి ఆడబిడ్డలకు ఇబ్బందులు పెడితే, ఢిల్లీకి వెళ్లి సమస్యలు చెప్పుకున్నారు' అని కేటీఆర్ వివరించారు.
Also Read: Radish Juice: ముల్లంగిని ఇలా తీసుకుంటే 'కొవ్వు' కొండలా కరిగించేస్తుంది
'అందరూ సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్. మేము ఎవరం ప్రచారం చేయం. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈసారి పట్నం నరేందర్ రెడ్డి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు' అని కేటీఆర్ ప్రకటించారు. అడ్డిమారు గుడ్డిదెబ్బ మాదిరి రేవంత్ రెడ్డి గెలిచాడని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ఒక దుర్యోధనుడు (రేవంత్ రెడ్డి) పరిపాలిస్తున్నాడని కేటీఆర్ వివరించారు. కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని చెప్పారు.
'14 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి ఎనుముల అన్నదమ్ములు , అల్లుడు, అదానీ కోసం పని చేస్తున్నాడు. టకిటకిమని రైతు భరోసా పడలేదు . టక్కు టక్కుమని తులం బంగారం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీ కోసం లగచర్ల భూములు గుంజుకునేందుకు సిద్దం అయ్యాడు. అడ్డుకున్నందుకు 40 మంది రైతులను జైల్లో పెట్టాడు' అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం
దుమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రా.. ఎవరు గెలుస్తారో చూద్దాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/bCnN8iEqJX
— KTR News (@KTR_News) February 10, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter