నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
''నా భర్తను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
బిగ్ బాస్-3 సీజన్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి తనను కలిసిన ఆ ప్రోగ్రాం ఇన్‌చార్జ్‌లు శ్యామ్, రఘులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.