Banks Transfer Policy: బ్యాంకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. బదిలీ పాలసీను అప్డేట్ చేయాలని ప్రభుత్వం నుంచి బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై బదిలీలు ఆటోమేటిక్ గా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకు సిబ్బంది ఆన్లైన్ ద్వారా లొకేషన్ ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం కలగనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో బదిలీ పాలసీలో పలు మార్పులు చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ సూచించింది. సంబంధిత బోర్డు నుంచి ఆమోదం లభించిన తరువాత 2026 నుంచి అమలు చేయాలని నిర్దేశించింది. బ్యాంకు ఉద్యోగుల బదిలీ పాలసీని సమీక్షించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్ ప్రభుత్వ బ్యాంకులకు లేఖ రాసింది. తద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని బ్యాంకులకు ఒకే బదిలీ విధానం రూపొందించవచ్చని అభిప్రాయపడింది. కొన్ని సూచనలు, మార్పుల ద్వారా బ్యాంకు ఉద్యోగుల బదిలీలను ఆటోమేటిక్ చేసేందుకు , ఆన్లైన్ ప్రక్రియ తీసుకొచ్చే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు వీలైనంతవరకూ సమీప ప్రాంతాల్లోనే బదిలీ చేయాలి. బదిలీ పాలసీ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ సూచించింది. పాలసీలో మార్పులు చేసి ఆ వివరాలు తమకు పంపించాలని కూడా సూచించింది.
కేంద్ర ఆర్ధిక శాఖ సూచనల ప్రకారం బ్యాంకులు బదిలీ పాలసీని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాంతో బదిలీ ఎందుకు, ఎలా చేస్తున్నారనేది ఉద్యోగికి కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు బదిలీ పాలసీని ఆటోమేటిక్ చేస్తున్నాయి. తమకిష్టమైన ప్రాంతం ఎంచుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు మాత్రం దగ్గరలోనే బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Also read: Fengal Cyclone: దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను, ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.