Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.
Renuka Chowdhury: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రేణుక చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రరచ్చకు దారితీశాయి. అంతేకాకుండా.. మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు గుప్పించుకున్నారు.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా తొర్రురు రోడ్డుమీద కాసేపు ఆగారు. అక్కడ మిర్చీ దుకాణంలో వెళ్లి సరదగా అక్కడివారిని పలకరించారు. అంతేకాకుండా అక్కడి చిన్న పిల్లలకు మిర్చీ బజ్జీలను కూడా తన చేతితో ఇచ్చారు.
Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.
Women Protest In T Jeevan Reddy Election Campaign: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అక్కడక్కడ అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న సీతక్కను ప్రజలు నిలదీయగా.. తాజాగా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డిని నిలదీశారు. ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో మహిళలు పలు విషయాలపై నాయకులను ప్రశ్నించారు. ఈ పరిణామంతో జీవన్ రెడ్డి, అక్కడే ఉన్న ఎమ్మెల్యే అసంతృప్తికి గురయ్యారు.
Gutha Amit Reddy Joins In Congress Party: బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నల్లగొండ లోక్సభ స్థానం టికెట్ ఆశించి భంగపడడంతో మాజీ సీఎం కేసీఆర్పై అసంతృప్తితో ఉన్న గుత్తా కుటుంబం ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనుంది.
MLA Harish Rao:బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ కు వేసిన ఛాలెంజ్ లో భాగంగా ఆయన గన్ పార్క్ వద్దకు చేరుకుని రాజీనామా పత్రంతీసుకుని వచ్చారు.
KCR On CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ ను అధికారంలోకి తెవడమే టార్గెట్ గా తెలంగాలోని లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అబద్దపు హమీలను, ప్రజలకు చెప్పి, మరల తమ ప్రభుత్వంను అధికారంలోకి తెవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో సూర్యాపేలో ఆయన మరోసారి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
Viral Video: తన భార్యకోసం ఒక వ్యక్తి బస్సులో సీటుకోసం కడ్చీఫ్ వేశాడు. కానీ మరోక వ్యక్తి ఆ సీట్లో తన భార్యను కూర్చుండ బెట్టాడు. ఇది చూసి మరో వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యకు కూర్చునే సీటులో ఎలా కూర్చుంటావంటూ కూడా గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బస్సుల మీద కాదూ కదా.. మోకాళ్ల మీద కూడా పాదయాత్రలు చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.